ఈనెల 10 నుండి పంట వివరాల నమోదు

2542చూసినవారు
ఈనెల 10 నుండి పంట వివరాల నమోదు
తెలంగాణలో వానాకాలం సీజన్ లో వేస్తున్న పంటల వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నెల 10వ తేదీ నుండి ప్రతీ రైతు పొలం వద్ద పంటలను ప్రత్యక్షంగా పరిశీలించి నమోదు చేయాలని తెలిపింది. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో పంట సీజన్ నెల రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో పంట వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్