స్వయం సహాయక సంఘాలకు రూ.30 కోట్లు విడుదల

77చూసినవారు
స్వయం సహాయక సంఘాలకు రూ.30 కోట్లు విడుదల
గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు (SHG)కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. SHGలలో సభ్యులైన మహిళలకు వడ్డీ లేని రుణాల నిమిత్తం రూ.30.7 కోట్ల నిధులను గురువారం విడుదల చేసింది. గత 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి, మార్చ్ రెండు నెలలకు సంబంధించిన వడ్డీ లేని రుణాల రాయితీని నేరుగా SHGల ఖాతాలలో జమ చేసినట్లు ఉత్తర్వుల్లో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్