గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఓ మహిళ చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక మహిళ తన బిడ్డను చంకలో ఎత్తుకుని నిప్పు వెలిగంచిన రెండు సీసాలతో విన్యాసాలు చేసింది. ఆమె తన ఒడిలో బిడ్డతో విన్యాసాలు చేయడం అందరినీ ఆకట్టుకుంది.