శ్రీవారి భక్తులకు తీపికబురు.. మరింత రుచిగా అన్నప్రసాదం

58చూసినవారు
శ్రీవారి భక్తులకు తీపికబురు.. మరింత రుచిగా అన్నప్రసాదం
శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు వెల్లడించారు. భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు అందిస్తున్నామని, మరింత రుచికరంగా అందించేందుకు అత్యాధునిక యంత్రాలతో అన్నప్రసాదాలు తయారు చేసేలా టీవీఎస్ మోటార్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత రుచిగా అందించేందుకు నాణ్యమైన ముడిసరుకులు, నెయ్యి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్