తెలంగాణలో గత పదేళ్లుగా ఎంగిలి పూల రోజు నుంచి సద్దుల పండుగ రోజు వరకు వాడవాడలా బతుకమ్మలు సందడి చేసేవి. కోట్ల రూపాయల వ్యయంతో మహిళలకు చీరల పంపిణీ జోరుగా సాగేది. బతుకమ్మ ప్రజలకు ఏమో గానీ BRSకి మాత్రమే సొంతమనే విధంగా జరిపేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. మన రాష్ట్రానికే ప్రత్యేకమైన ఈ పండుగకు రేవంత్ సర్కార్ కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పండుగ నిర్వహణ కోసం ఇంతవరకు నిధులను కూడా విడుదల చేయలేదు.