బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆన్‌లైన్ గేమింగ్ పై కఠినమైన చర్యలలో భాగంగా 385 కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. 'బెట్టింగ్ యాప్‌లను అరికట్టడానికి కఠిన చర్యలు అమలవుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు గురైనా, లేదా మీకు కనిపించే బెట్టింగ్ ప్లాటుఫారంలపై ఫిర్యాదు చేయండి.. లేదా వాట్స్ఆప్(8712672222) చేయండి' అని నంబర్ ఇచ్చింది.