టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, మరో ఆటగాడు యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ముంబై తదుపరి రంజీ మ్యాచ్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం కావడానికి రోహిత్, జైస్వాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్-యశస్వి ఈ విషయాన్ని ముంబై టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు సమాచారం.