తిరుమల ఘాట్‌లో 2 ప్రమాదాలు

55చూసినవారు
తిరుమల ఘాట్‌లో 2 ప్రమాదాలు
AP: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం రెండు వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చెన్నైకి చెందిన భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు వెళ్తుండగా కారు టైరు పేలిపోయింది. దాంతో కారు అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది. హైదరాబాద్‌కు చెందిన పి.గంగాధర్‌రావు కుటుంబం ఇదే మార్గంలో కారులో వెళ్తుండగా.. కల్వర్టును ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది.

సంబంధిత పోస్ట్