మా నాన్న బతికి ఉంటే బాగుండేది: అజిత్

73చూసినవారు
మా నాన్న బతికి ఉంటే బాగుండేది: అజిత్
పద్మ భూషణ్ పురస్కారంపై నటుడు అజిత్ కుమార్ స్పందించారు. “పద్మభూషణ్ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో ఏళ్లుగా రేసింగ్, షూటింగ్లో నాకు సహకారం అందించిన నా కుటుంబం, స్నేహితులు, అభిమానులకు కృతజ్ఞతలు. ఈరోజును చూసేందుకు నా తండ్రి జీవించి ఉంటే ఎంతో బాగుండేదినిపిస్తోంది. నన్ను చూసి ఆయన గర్వపడేవాడు” అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్