నెల్లూరులో రౌడీ షీటర్ ఎ.సుజన్‌ కృష్ణ దారుణ హత్య (వీడియో)

66చూసినవారు
AP: నెల్లూరు నగరంలో శుక్రవారం రాత్రి రౌడీ షీటర్‌ ఎ.సుజన్‌ కృష్ణను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంలో కలకలం రేపింది. నగరంలోని పొదలకూరురోడ్డు ఇందిరాగాంధీ నగర్‌ రెండో వీధిలో ఉండగా గుర్తుతెలియని యువకులు ముగ్గురు కత్తులతో పొడిచి పరారయ్యారు. పాత కక్షల వల్లే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కల్లూరుపల్లిలో హౌసింగ్‌ బోర్డులో నివాసం ఉంటున్న ఎ.సుజన్‌ కృష్ణ అలియాస్‌ చింటూ (24)పై వేదాయపాలెం PSలో రౌడీషీటు ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్