తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకానికి నవంబర్ నెలకు గాను విద్యుత్ సబ్సీడి వ్యయాన్ని తీర్చేందుకు రూ.180.62 కోట్లను విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని టీజీ డిస్కంలకు అందించనున్నారు. గృహ అవసరాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 50 లక్షల మంది గృహ వినియోగదారులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు.