ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. నడ్డా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే.. 'గర్భిణులకు రూ.21వేల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు, 'మహిళా సమృద్ధి యోజన' కింద మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తాం" అని హామీ ఇచ్చారు.