ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పలు పథకాలకు శ్రీకారం చుడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలుకు సిద్ధం కావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మత్స్యకార భరోసా అమలుకు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.