గుండె ఆరోగ్యంగా ఉండాలంటే హార్ట్ పేషెంట్లు సులభమమైన ఆహారప్రణాళికను ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒక గ్లాస్ నిమ్మకాయ రసం లేదా ఉసిరికాయ జ్యూస్ తాగాలి. లేకపోతే అత్తి పండ్లు, ఎండు ద్రాక్ష తింటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీలైతే రాత్రి బాదం పప్పు నానబెట్టి ఉదయం తినడం మంచిది. అలాగే ఉదయం 30 నిమిషాలు వ్యాయామం, యోగా చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.