ఐపిఎల్ లో రుతురాజ్ గైక్వాడ్ రికార్డు

12318చూసినవారు
ఐపిఎల్ లో రుతురాజ్ గైక్వాడ్ రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డు సృష్టించాడు. టాస్ ఓడి చెన్నై బ్యాటింగ్ కు దిగింది. ఈ సీజన్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న రుతురాజ్ 23 పరుగులు చేయగానే ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ లో ఈ జాబితాలో ఇప్పటిదాకా పంజాబ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఉండగా రుతురాజ్ అతడిని అధిగమించాడు. కెఎల్ రాహుల్ 626 పరుగులతో రెండో స్థానానికి చేరాడు. గైక్వాడ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ శిఖర్ ధావన్ (587) మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో ఈ క్యాప్ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రుతురాజ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్ మ్యాన్ షాన్ మార్ష్ పేరిట ఉంది. 2008లో పంజాబ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మార్ష్ ఆ సీజన్ లో 11 మ్యాచుల్లో 616 పరుగులు చేశాడు. అప్పటికీ మార్ష్ వయస్సు 25 సంవత్సరాలు. కానీ ప్రస్తుతం గైక్వాడ్ వయసు 24 ఏళ్లు మాత్రమే కావడంతో చరిత్ర నెలకొల్పాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్