సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల గ్రామం సి ఎస్ ఐ సెంట్రల్ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధనలు నిర్వహించారు. ఈ ఆరాధనలో గురువులు రెవ ఎం. రవికుమార్ యేసు ప్రభువు ఆ సిల్వ మీద పలికిన 7 మాటలను వివరిస్తూ మానవులు చేసిన పాపానికై యేసు ప్రభువు మరణించిన రోజునే గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటాము అన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ తలారి ఇమ్మానుయేల్, గబ్రీయల్, మాణిక్యం, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.