చౌటకూర్‌లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

564చూసినవారు
చౌటకూర్‌లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మద్య బస్తీ కాలనీ వాసులు. బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మాజీ ఉప ప్రధాని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరి, కిషోర్, ప్రభాకర్, రాములు, రాజు, నవీన్, కరుణాకర్, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్