తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందంటూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడం నిరసిస్తూ గురువారం అందోల్ నియోజకవర్గంలో భారీ మౌన ప్రదర్శన నిర్వహించారు. అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నాయకత్వంలో వందలాది మంది మౌనన ప్రదర్శనలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని వాటిలో రైతులకు ఇస్తానన్న భరోసా రూ. 15, 000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.