ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సర్వని సరోజ మల్లేశం నాయకత్వంలో టేక్మాల్ మండలం తంప్లూర్ గ్రామానికి చెందిన రూ. 1, 25, 000 విలువగల 3 సీఎంఆర్ఎఫ్ చెక్కులను తంప్లూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ కొండ నాగయ్య, సొసైటీ డైరెక్టర్ చిన్న మల్లేశం పాల్గొన్నారు.