భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం ఉండాలని అన్నారు. కంగ్టి పోలీస్ స్టేషన్లో హెల్ప్ లైన్ నెంబర్ 8712656760 ఏర్పాటు చేశామని అన్నారు.