దిశ కమిటీ సభ్యుడిగా ప్రకాష్ రాథోడ్
కంగ్టి మండల పరధిలోని ముకుంద నాయక్ తాండకు చెందిన ప్రకాష్ రాథోడ్ ను గురువారం దిశ కమిటీలో సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ప్రకాష్ రాథోడ్ మాట్లాడుతూ. దిశ కమిటీలో సభ్యులుగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దిశ కమిటీ చైర్మన్ గా ఎంపీ సురేష్ సెట్కార్ ఉండడం, అలాగే మా ప్రాంత ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డితో నేను పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. అందరం కలసి జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలని అయన అన్నారు.