గ్రంధాలయాన్ని ప్రారంభించిన విద్యా కమిటీ చైర్మన్

1612చూసినవారు
విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించుట కొరకు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జీవన్ రాథోడ్ ఆర్థిక సాయంతో మాయికోడ్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం గ్రంధాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం పట్ల విద్యార్థులకు అవగాహన పెంపొందించుటకు గ్రంధాలయాలు ఎంతో దోహదపడతాయని వారన్నారు. ఈ గ్రంథాలయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మన ఊరికి, మన ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు. ఉన్నత వ్యక్తుల జీవిత చరిత్ర తెలుసుకొని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. విద్యార్థులు మంచి అలవాటు అలవరచుకోవాలన్నారు. ఈ గ్రంథాలయంను ఒక దేవాలయంగా భావించి క్రమశిక్షణతో మెదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జీవన్ రాథోడ్, రాజ్ కుమార్, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్