సిర్గాపూర్ మండలం విద్యుత్ వినియోగదారులు గృహజ్యోతి పథకం కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఫోన్ నెంబర్ ఇవ్వాలని లైన్మెన్ మైపాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సిర్గాపూర్ ఉప కేంద్రంలో ఈనెల 15 వరకు వివరాలు సూచించారు. ఈ వివరాలు ఇవ్వని వారికి ఉచిత విద్యుత్ పథకం వర్తించదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో భాగంగా వివరాలు ఇవ్వాలని కోరారు.