ఖేడ్: శ్రీ కాశీనాథ్ ఆలయ భూములు కాపాడండి

78చూసినవారు
నారాయణఖేడ్ పట్టణ పరిధిలో పురాతన కాశీనాథ్ ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని కాపాడాలని బుధవారం బీజేపీ రాష్ట్ర ఓబిసి మోర్చా కార్య వర్గ సభ్యులు సాయిరాం డిమాండ్ చేశారు. కాశీనాథ్ ఆలయ భూముల్లో అక్రమంగా 40 ఫీట్ల రోడ్డు ప్రైవేట్ వెంచర్ కోసం వేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. వెంటనే దేవదాయ శాఖ, మున్సిపల్, ఇతర శాఖలు స్పందించి కబ్జాకు గురవుతున్న రోడ్డు నిర్మాణ పనులు ఆపివేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్