తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్ అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ సోమవారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని చెప్పారు. సిపిఎం ఏరియా కమిటీ ఇన్ ఛార్జ్ నల్లవల్లి రమేష్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సంఘాల నాయకులు సతీష్, అరుణ్ పాల్గొన్నారు.