నాగల్‌గిద్ద మండల ఎనక్ పల్లి నుండి మావినెల్లి తండా మార్గంలో గల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణీకులు, గ్రామస్తులు రాత్రి వేళల్లో ఈ రోడ్ల గుండా ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. ఎమ్మెల్యే సారూ.. ఒకసారి మా ఊరి రోడ్డు పరిస్థితి చూడండని గ్రామస్తులు బుధవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.