నల్ల పోచమ్మకు ప్రత్యేక అలంకరణతో పూజలు

53చూసినవారు
నల్ల పోచమ్మకు ప్రత్యేక అలంకరణతో పూజలు
సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచ శివారులో వెలసిన నల్ల పోచమ్మ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమార్చన, ఆరాధన పూజలు చేశారు. అనంతరం నుదుట పసుపు కుంకుమ తిలకం దిద్ది, పట్టు వస్త్రాలు సమర్పించి, పలు ద్రవ్యాలు, వివిధ రకాల సుగంధ పుష్పాలంకరణ చేశారు. అనంతరం పూజారి నాగేష్ స్వామి అమ్మవారికి హారతి సమర్పించి నైవేద్యం నివేదన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్