నారాయణఖేడ్: రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు

68చూసినవారు
నారాయణఖేడ్: రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. పట్టణంలోని చాంద్ ఖాన్ పల్లి నుంచి కంగ్టి వరకు వెళ్లే బైపాస్ రోడ్డు నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. నారాయణఖేడ్ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్