78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నారాయణఖేడ్ మండలం పరిధి లోని మంగళపేట్ లో శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి భవనం పైన స్వర్ణకార సంఘం అధ్యక్షులు: సత్యం చారి, ఉపాధ్యక్షులు: రవీందర్ చారి, సరాఫ్ శ్రీనివాస్, ఆసలి నవీన్ కుమార్ లు గురువారం జాతీయ జెండాను ఎగరవేశారు. వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు.