సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ అబ్దుల్ నయీమ్ ఖాన్ తెలిపారు. రేపు సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఎంపీడీవో ఆఫీస్ సమావేశం మందిరంలో గ్రీవెన్స్ సెల్ ప్రక్రియ జరుగుతుందన్నారు. గ్రామ సమస్యలు, రెవెన్యూ సమస్యలు తదితర వాటి పరిష్కారం కోసం అధికారులను సంప్రదించి, వినతులు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.