సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఓల్డ్ రామచంద్రాపురంలోని జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాథోడ్, మల్లేష్, కావలి శ్రీరాములు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.