రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ గురువారం రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ పర్యటించారు. అశోక్ నగర్, జ్యోతి నగర్ మధ్య భాగంలో సుమారు కోటి రూపాయలతో నిర్మిస్తున్న ఓపెన్ డ్రైన్ పనులు చివరిదశకు చేరుకున్నాయ. జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఈఈ సురేష్, ఏఈ ప్రభుతో కలిసి పనులను పరిశీలించారు. నూతన ఓపెన్ డ్రైన్ పాత డ్రైన్ లో కలపడానికి పలు సమస్యలు ఉన్నాయి. సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆమె ఆదేశించారు.