సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎండీర్ ఫౌండేషన్ వారు శుక్రవారం అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలో బస్టాండ్ ఆవరణలో బిక్షాటన చేస్తున్న వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. గమనించిన కొంత మంది పోలీసులకు సమాచారం అందించగా, అతని గురించి విచారించగా, అతనికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియకపోవడంతో ఎండీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతక్రియలు నిర్వహించారు.