సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని "భ్రమరాంబిక" కాలనీలో శుక్రవారం సాయంత్రం ఐద్వా, సి. ఐ. టి. యూ. ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చిన మహిళలు బతుకమ్మ ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మహిళా భక్తులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.