పటాన్ చెరు నియోజకవర్గంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొల్లూరు, రాయదుర్గంలోని పలు ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం ఉదయం ప్రత్యేక బృందాలు కొల్లూరుకు చేరుకొని గుగి ప్రాపర్టీస్, అండ్ డెవలపర్స్, అన్విత్ బిల్డర్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 30 చోట్ల ఏకకాలంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.