బొల్లారం 10వ వార్డ్ కౌన్సిలర్ గా నరసింహారాజు ప్రమాణ స్వీకారం

59చూసినవారు
సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ గా కమ్మరి నరసింహ రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా సెషన్స్ జడ్జీ తీర్పుతో రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ ఆదేశంతో కమిషనర్ మంగతాయారు 10వ వార్డ్ కౌన్సిలర్ గా కమ్మరి నరసింహ రాజు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా రాణి, ఆర్వో నర్సింహులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్