పాశమైలారం పారిశ్రామికవాడలో ట్రాఫిక్ నియంత్రణకు ఎస్పీ రూపేష్ బుధవారం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పటాన్ చెరు, ఇసనాపూర్, బీరం గూడ డ్రోన్ ద్వారా ట్రాఫిక్ రద్దీని ఎస్పీ పరిశీలించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పాఠశాల, కళాశాల బస్సులు వచ్చే సమయంలో పరిశ్రమల వాహనాలను అనుమతించవద్దని సూచించారు. ట్రాఫిక్ మార్చల్ పేరుతో నియంత్రణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు.