సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణ గాంధీ థీమ్ పార్క్ వద్ద శుక్రవారం ఉదయం వినాయక చవితి పండగ సందర్భంగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేశారు. కృత్రిమ రంగులతో తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించాలని ఎమ్మెల్యే సూచించారు.