త్వరలో ప్రారంభించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని డిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శివకుమార్ అన్నారు. సంగారెడ్డి లోని కార్యాలయంలో సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనకు లోబడి కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో సిబ్బంది పాల్గొన్నారు.