జిల్లాలో చెరువులు, కుంటలు ఆక్రమణ జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ హెచ్ఎండిఏ వెబ్ సైట్ లో 8 మండలాలకు సంబంధించిన మ్యాపింగ్ ఉంచాలని చెప్పారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.