'నీకంటే నేనే ఫాస్ట్‌గా వేస్తా'.. రాణాతో స్టార్క్ చిట్‌చాట్

56చూసినవారు
భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న స్టార్క్‌ను రాణా బౌన్సర్లతో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు. ‘‘హర్షిత్.. నీకంటే నేనే ఎక్కువగా ఫాస్ట్‌ వేస్తా. నువ్వు కూడా బాగా వేస్తున్నావు. అయితే, నీకంటే నేనే వేగంగా వేస్తాను’’ అని స్టార్క్ అన్నాడు. ఆ మాటలకు హర్షిత్ నవ్వులు చిందించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్