సదాశివపేట పట్టణంలోని బాలాజీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథునికి నవ రాత్రులు పూజలు అందించి ఆదివారం నిమజ్జనం చేశారు. అనంతరం కుటుంబ సమేతంగా పలు వాహనాల్లో వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం తండాలోని ప్రసిద్ధ భూ కైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. ప్రధాన ద్వారం నుంచి శివలింగం వరకు నీటి మార్గాన 12 శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు.