సంగారెడ్డిలో కురుస్తున్న వర్షం

1084చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఒక్కసారిగా వర్షం కురిసి వాతావరణం చల్లబడటంతో ఉపశమనం కలిగింది. వర్షం పడుతుండడంతో సంగారెడ్డి పట్టణంలో విద్యుత్ కోతను అధికారులు విధించారు.