మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళదామని మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి బుధవారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన ఘనత గాంధీకి దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.