కంది సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న ఈర్యా నాయక్ ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గురువారం పరామర్శించారు. ప్రస్తుతం ఈర్యా నాయక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. సెకండ్ ఒపీనియన్ కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి, రాజేందర్, జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.