కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

68చూసినవారు
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. డిఆర్ఓ పద్మజారాణి ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రం స్వీకరించారు. 67 మంది వివిధ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు డిఆర్ఓ పద్మజ రాణి ఆదేశించారు.