కౌన్సిల్ కు సమాచారం ఇవ్వకుండా టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి అభివృద్ధి పనులను ప్రారంభించడం సరికాదని మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ అన్నారు. సదాశివపేటలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ లకు తెలపకుండా అభివృద్ధి పనులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్జీఎఫ్ పెండింగ్ నిధులను విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.