సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో కృత్తికా నక్షత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలు జరిపించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించి లలిత సహస్ర పారాయణం చదివారు. అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.