కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ముదిరాజ్ కులస్తులను బిసిఏ లో చేర్చాలని మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి అన్నారు. సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముదిరాజ్ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని చెప్పారు. సమావేశంలో నాయకులు మాణిక్యం, పులిమామిడి రాజు, సత్యనారాయణ పాల్గొన్నారు.