సంగారెడ్డి: రేపు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ వార్షికోత్సవం

76చూసినవారు
సంగారెడ్డి పట్టణం శ్రీనగర్ లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తృతీయ వార్షికోత్సవం ఈ నెల 18వ తేదీన నిర్వహిస్తున్నట్లు దేవల కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, 10 గంటలకు లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి హాజరవుతారని పేర్కొన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్